BIKKI NEWS (June 23) : BR Ambedkar open University admissions 2026. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీ.జీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
BR Ambedkar open University admissions 2026
కోర్సుల వివరాలు
- డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు,
- పీ.జీ – ఎం.ఏ – ( తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్)
- ఎం.కాం,
- ఎం.ఎస్సీ – (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రం కోర్సులు),
- ఎం.ఎల్ఐఎస్సి,
- డిప్లొమా,
- పలు సర్టిఫికెట్ కోర్సులు
అర్హతలు : భారత దేశ పౌరులు ఎవరు అయినా పై కోర్సుల్లో వారికి ఉన్న కనీస అర్హత ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు.
డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, లేదా పదో తరగతి తర్వాత ఏదేనీ రెండు సంవత్సరాల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, ఓపెన్ స్కూల్ లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు.
అయితే సదరు అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం గడువు: ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది ఆగష్టు 7, 2026.
ఇప్పటికే ఆయా కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును ఆగష్టు 7వ తేదీ లోపు ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.
డిగ్రీ 2021-22 నుండి 2025-26 రెండో, మూడో సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు అదేవిధంగా పీజీ 2023-24 నుండి 2025-26 బ్యాచ్ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా అడ్మిషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్ లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చు.
హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570, 040-23680222/ 333 / 555 ఫోన్ నెంబర్ లలో టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు.
వెబ్ సైట్స్:
www.braouonline.in
www.braou.ac.in
