BIKKI NEWS (MAY 09) : TG EAPCET 2026 guidelines for students. తెలంగాణ రాష్ట్ర ఈఏపిసెట్ 2026 పరీక్షలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. మే 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు.
ఈ ఇంజనీరింగ్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే బైపీసీ విభాగంలో దాదాపు 90 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
TG EAPCET 2026 guidelines for students
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఏదైనా గుర్తింపు పొందిన ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు వంటివి పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు.
పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందుగా చేరుకోవడం చాలా ముఖ్యం.
ఫోర్ నూన్ (FN): ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు. (రిపోర్టింగ్ సమయం: ఉదయం 7:30 గంటలకు).
ఆఫ్టర్ నూన్ (AN): మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు. (రిపోర్టింగ్ సమయం: మధ్యాహ్నం 1:30 గంటలకు).
ముఖ్య గమనిక: పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు.
నిషేధిత వస్తువులు: క్యాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, పేజర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను అనుమతించరు.
స్టేషనరీ: రఫ్ వర్క్ కోసం పరీక్షా కేంద్రంలోనే పేపర్లు ఇస్తారు. మీరు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి.
బయోమెట్రిక్: అభ్యర్థుల వేలిముద్రలు (Biometric) మరియు ఫోటోలను పరీక్షా కేంద్రంలో సేకరిస్తారు, కాబట్టి గోరింటాకు (Mehendi) లేదా టాటూలు వేసుకోకుండా ఉండటం మంచిది.

