BIKKI NEWS : DAILY GK BITS PART 135 – for Compititive exams. డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్ పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు.
DAILY GK BITS PART 135
1) వక్ఫ్ భూములు అనగానేమి.?
జ : ముస్లిం మత సంస్థల నిర్వహణకు ఇచ్చిన భూములు
2) అగ్ని పర్వతాలలో ఏ రకమైన శక్తి ఉంటుంది.?
జ : జియోథర్మల్ శక్తి
3) వ్యవసాయ రంగానికి శక్తిని అందించే అణు రియాక్టర్ ఎక్కడ ఉంది.?
జ : నరోరా – ఉత్తర ప్రదేశ్
4) ఎల్లో కేక్ అని దేనిని పేర్కోంటారు.?
జ : యూరోనియం.
5) భారత్ లో ఎక్కువగా ఉన్న అణు ఇంధనం ఏది.?
జ : థొరియం
6) “నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ” ఎక్కడ ఉంది.?
జ : చెన్నై
7) భారతదేశం లో పర్యావరణ రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1986
8) నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కేంద్రంలోని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తోంది.?
జ : కేంద్ర హోమ్ శాఖ
9) ఆమైనో ఆమ్లాల లో ఉండే ప్రమేయ సమూహాలు ఏవి.?
జ : ఆమైనో, కార్బాక్సిల్ గ్రూప్
10) బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి.?
జ : సోడియం హైడ్రో కార్బోనేట్
11) వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి.?
జ : సోడియం కార్బోనేట్
12) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన నామం ఏమిటి.?
జ : కాల్షియం సల్ఫేటు హెమి హైడ్రేట్
13) అరటి లో ఉండే ప్రధాన మూల పోషకం ఏమిటి.?
జ : ఫాస్పరస్ (భాస్వరం)
14) ఐదు రాజ్యాల వర్గీకరణ ప్రకారం బాక్టీరియా ఏ వర్గానికి చెందుతుంది.?
జ : మోనీరా
15) ఆమ్లం – క్షారం మద్య జరిగే చర్యను ఏమంటారు.?
జ : తటస్థీకలణ చర్య
16) పిల్లలలో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది.?
జ : విటమిన్ – D
17) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా PH విలువ ఎంత.?
జ : 10
18) సరస్సులోని నీటి కాలుష్యాన్ని సూచించేది.?
జ : యూట్రోఫికేషన్
19) పత్రాలకు ఆకుపచ్చని రంగును ఇచ్చేవి ఏవి.?
జ : క్లోరోప్లాస్ట్
20) మిశ్రమ అటవీ నిర్వహణ అనే భావనను భారతదేశంలో ఏ దశాబ్దంలో ప్రవేశపెట్టారు.?
జ : 1980 లలో
21) కోసి నది ఏ నదికి ఉపనది.?
జ : గంగా
22) కులు లోయలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి.?
జ : హిమాచల్ ప్రదేశ్
23) ఏ అర్టికల్ ఒక వ్యక్తిని అక్రమ కస్టడీ నుండి కోర్టు ముందుకు తీసుకు రాగలదు.?
జ : హెబీయస్ కార్పస్
24) భారత దేశంలో న్యాయమూర్తుల పదవి విరమణ కాలం ఎంత.?
జ : 65 సంవత్సరాల వరకు
25) 73 మరియు 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఏ పరిపాలన ప్రోత్సాహం పొందింది.?
జ : స్థానిక స్వపరిపాలన
26) పంచాయతీ రాజ్ సంస్థలను దాని పదవీకాలం ముగియకుండానే ఎవరు రద్దు చేయగలరు.?
జ : రాష్ట్ర ప్రభుత్వం
27) భారతదేశంలో బ్రిటిష్ కాలంలో రాయట్ (Ryot) అనే పదం దేనితో ముడిపడి ఉంది.?
జ : భూ ఆదాయం
28) ఏ ఎన్నికలలో మొట్టమొదటిసారి NOTA ప్రవేశపెట్టారు.?
జ : 2013 (డిల్లీ, చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో)
29) మడ అడవులలో సాదరణంగా కనిపించే జంతువు.?
జ : రాయల్ బెంగాల్ టైగర్
30) అస్తమా, అల్సర్ వ్యాధులకు ఏ ఔషధ మొక్క ఉపయోగిస్తారు.?
జ : కచ్నార్
