BIKKI NEWS : Current affairs in Telugu March 27th 2026 – కరెంట్ అఫైర్స్
Current affairs in Telugu March 27th 2026
1) ఇటీవల విడుదలైన ‘Unlikely Paradise’ పుస్తకం ఎవరికి సంబంధించినది?
జ : సంజయ్ రౌత్
2) ఇటీవల USA Morning Consult సర్వే ప్రకారం, 68% ఆమోదంతో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు?
జ : నరేంద్ర మోదీ
3) ఇటీవల IPL చరిత్రలో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఏది నిలిచింది?
జ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
4) ఇటీవల సరస్వతి సమ్మాన్ 2025కి ఎవరిని ఎంపిక చేశారు?
జ : రామ్‌కుమార్ ముఖోపాధ్యాయ్
5) ఇటీవల QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సబ్జెక్ట్)లో మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ISM ధనబాద్ ఎన్ని స్థానం పొందింది?
జ : 21వ స్థానం
6) ఇటీవల అగ్నికుల్ కాస్మోస్ తన మొదటి పూర్తి 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజిన్ ‘Agnite’ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది?
జ : చెన్నై
7) ఇటీవల ‘వాయు బాణ్’ ప్రాజెక్ట్‌ను ఎవరు ప్రారంభించారు?
జ : భారతీయ వైమానిక దళం
8) ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) యొక్క 14వ మంత్రిత్వ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది?
జ : కామెరూన్
9) ఇటీవల ముల్గావ్ కెల్బాయ్ పెఠ్ ఉత్సవం ఎక్కడ నిర్వహించారు?
జ : గోవా
10) ఇటీవల అడవి ఉత్పత్తుల కోసం ‘ప్రమాణ్’ సర్టిఫికేషన్ పొందిన తొలి రాష్ట్రం ఏది?
జ : ఆంధ్ర ప్రదేశ్

