BIKKI NEWS (MAR. 11) : Free EV Scooties for Telangana students. తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ మరియు ఇతర కోర్సులు చేస్తున్న అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.
Free EV Scooties for Telangana students.
దాదాపు 1,70,000 విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేయడానికి 1,600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది.
మార్చి 16 నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలలో నిధులను ఈ పథకం కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు ఈ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేయనున్నారు. ముందుగా డిగ్రీ, బి.టెక్ విద్యార్థినిలకు స్కూటీలు పంపిణీ చేసి తరువాత మిగిలిన కోర్సులు చదువుతున్న విద్యార్థినిలకు కూడా దశలవారీగా ఉచిత స్కూటీలను పంపిణీ చేయనున్నారు.
విద్యార్థినిలు ప్రతిరోజు కళాశాలకు వెళ్లేందుకు పెట్రోల్ భారం లేకుండా అలాగే పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
