BIKKI NEWS (MAR. 08) : INDvsNZ – Team India huge score in ICC T20 World Cup final. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరును 255 ను సాధించింది.
INDvsNZ – Team India huge score in ICC T20 World Cup final
16 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఉండకపోతే ఇంకా భారీ స్టోర్ వచ్చే అవకాశం ఉండేది.
సంజు శాంసన్ తన ఫాం కొనసాగించి 46 బంతుల్లో 5 ఫోర్స్ , 8 సిక్స్ లతో 89 పరుగులు సాధించాడు.
కీలక సమయంలో ఫామ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ 18 బంతుల్లో అర్ధ సెంచరీ (51) తో భారీ స్కోరుకు బాటలు వేశాడు.
వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు సాధించి ఔటయ్యాడు.
చివరి ఓవర్ లో దూబే బౌండరీలతో విరుచుకుపడి 24 పరుగులు రాబట్టాడు.
జేమ్స్ నిసామ్ వేసిన 16 ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో రిథమ్ కోల్పోయింది. శాంసన్, కిషన్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా ఈ ఓవర్ లో వెనుదిరిగాడు.
మొత్తం 20 ఓవర్ లలో టీమిండియా 255 పరుగులు సాధించి, కీలక ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్ బౌలింగ్ దళం కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేస్తే మూడో టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ సొంతం కానుంది.
- Today Gold Rate June 23rd 2026 – భారీగా తగ్గిన బంగారం ధర
- Telangana Anganwadi jobs Vacancies 2026 – నోటిఫికేషన్ లు షురూ, అర్హతలు, ఖాళీల వివరాలు
- Today Gold Rate June 21st 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

