Poetry day - "కవి ఏమవుతాడు" - ఉమాదేవి ప్రత్యేక కవిత - bikki news

Poetry Day – “కవి ఏమవుతాడు” – ఉమాదేవి ప్రత్యేక కవిత

BIKKI NEWS (FEB. 20) : World Poetry day 2026 a poem by Addagudi Umadevi. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అడ్డగూడి ఉమాదేవి రచించిన ప్రత్యేక కవిత.

World Poetry day 2026 a poem by Addagudi Umadevi

ఆవేశాక్షర శరాలను సంధిస్తూ
సమసమాజ నిర్మాణానికి అంకుశమవుతాడు

పదనెక్కిన పదమై పద్మవ్యూహాలను ఛేదిస్తూ
అభ్యుదయ పథ దిక్సూచిలా సాగుతాడు

వడిగొను వాక్య వాతూలమై వర్ణాలను మట్టిలో కలుపుతూ నిచ్చెన మెట్లను కూల్చుతాడు

గర్జించు గ్రంథమై గురివిందగింజల నిజరూపుకు నిలువెత్తు సాక్షమౌతాడు

పేకమేడల కలల సౌధాలకు పునాదియై
చెదిరిన బతుకులకు చేయూతగ నిలుస్తాడు

నిశ్శబ్ద శబ్దాల సారమై మనసు పొరలను తాకుతూ
అనంత భావావేశ ఉత్తుంగ తరంగాల సింధువవుతాడు

అక్షరమై,పదమై,వాక్యమై,గ్రంథమై రవి గాంచని చోటుకు సాగుతూ
అక్షర శిల్పియై పొత్తమునేలుతాడు

అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రి కళాశాల
వరంగల్
9908057980

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →