LOCAL STATUS – 9 నుంచి ఇంటర్‌ వరకు స్థానికంగా చదివితేనే లోకల్‌

BIKKI NEWS (JULY 21) : 9th to inter must study in Telangana for local status. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ కన్వీనర్ కోటాలో సీట్లు పొందాలంటే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ తెలంగాణ రాష్ట్రంలో చదివితేనే అర్హులని నిపుణులు తెలిపారు .

9th to inter must study in Telangana for local status

నీట్‌ పరీక్షకు అర్హత ఇంటర్మీడియట్‌ కాబట్టి, వరుసగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదివితేనే వారిని స్థానికులుగా పరిగణిస్తారు..

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు కావాలంటూ 9 – 12 వ తరగతి వరకు ఇక్కడే చదవాలి ‌. ఒకవేళ ఏదైనా దూరవిద్య ద్వారా చదివినా.. అలాంటి వారికి గత నాలుగేళ్లుగా తెలంగాణలో ఉన్నట్టుగా రెసిడెంట్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లలో ఒక్క ఏడాది బయట వేరే రాష్ట్రాల్లో చదివినా నాన్‌లోకల్‌ అయిపోతారు.