Jobs – అగ్రి, హార్టి, వెటర్నరీ యూనివర్సిటీలలో 994 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

994 jobs notification soon in agriculture university

BIKKI NEWS (July 02) : 994 Jobs notification soon in agriculture University ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీ లలో 984 ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

994 Jobs notification soon in agriculture University

ఈసారి చేపట్టబోయే నియామకాల్లో ఇంటర్వ్యూ లను ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పూర్తిగా రాత పరీక్ష మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇటీవల అగ్రివర్సిటీ తమ పరిధిలో 550 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు మౌఖిక పరీక్షలు లేకుండా రాత పరీక్షలతో 550 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అగ్రివర్సిటీ వీసీ జానయ్య తెలిపారు.

మరోవైపు హార్టికల్చర్ యూనివర్సిటీ ఇటీవల 79 అసిస్టెంట్, 44 అసోసియేట్‌ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వాటిలోనూ ఇంటర్వ్యూలను మినహాయించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరోవైపు పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ కూడా తమ పరిధిలో బ్యాక్‌లాగ్, కొత్తవి కలిపి మొత్తం 294 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →