BIKKI NEWS (DEC. 20) : 500 rupees bonus for farmers. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కొరకు సన్న వడ్ల బోనస్ పంపిణీకి ముహూర్తం ఖరారైంది. గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సుమారు 24 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయంతో నేరుగా లబ్ధి చేకూరనుంది.
500 rupees bonus for farmers.
వరి సన్న రకాలు సాగు చేసిన వారికి క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649 కోట్ల నిధులను చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ సమన్వయంతో ఈ నగదు బదిలీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రైతులు పండించిన సన్న రకాలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన తర్వాత, వారి వివరాలను పరిశీలించి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు.
కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున ఈ బోనస్ అందుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
ధాన్యంలో తేమ శాతం, గింజ నాణ్యతను బట్టి ఈ బోనస్ ఖరారు చేస్తారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

