Bsf jobs - బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో వారికి 50% కోటా - bikki news

BSF JOBS – బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో వారికి 50% కోటా

BIKKI NEWS (DEC. 21) : 50% QUOTA FOR AGNIVEERS IN BSF CONSTABLE JOBS. బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల నియామకాల్లో గతంలో 10 శాతం ఉన్న మాజీ అగ్నివీరుల కోటాను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

50% QUOTA FOR AGNIVEERS IN BSF CONSTABLE JOBS

మాజీ అగ్నివీరుల మొదటి బ్యాచ్ కు ఐదు సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితి సడలింపు, మిగిలిన వారికి మూడేళ్ల సడలింపును కల్పించింది.

మాజీ అగ్నివీరులకు శారీరక ప్రమాణాలు, సామర్థ్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుందని నోటిఫికేషన్ పేర్కొంది.

ప్రత్యక్ష నియామకం ద్వారా ప్రతి ఏడాది చేపట్టే నియామకాల్లో 50 శాతం మాజీ అగ్నివీరులకు, 10 శాతం మాజీ సైనికులకు, 3 శాతం వరకు పోరాట కానిస్టేబుల్ (ట్రేడ్స్ మెన్)కు కేటాయించనున్నట్లు తెలి పింది.

మొదటి దశలో మాజీ అగ్నివీరుల కోసం కేటాయించిన 50శాతం ఖాళీలకు నోడల్ ఫోర్స్ నియామకాలు చేపడుతుంది.

రెండో దశలో అగ్నివీరులు కాకుండా మిగిలిన 47శాతం (10 శాతం మాజీ సైనికులతో కలిపి) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →