BIKKI NEWS (MAY 08) : 50 Percentage weightage for contract para teachers says Supreme court. జార్ఖండ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పారా టీచర్లకు 50 శాతం పోస్టులు కేటాయించి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని సుప్రీంకోర్టు జార్ఖండ్ కు సంబంధించిన పారా టీచర్ల క్రమబద్ధీకరణ కేసులో విస్పష్ట తీర్పును ఇచ్చింది.
50 Percentage weightage for contract para teachers says Supreme court
పారా టీచర్లుగా పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని జార్ఖండ్ హైకోర్టును సంప్రదించగా హైకోర్టు కొట్టి వేయడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విద్యార్థులు టీచర్ల మధ్య బంధం తాత్కాలికం కాదని అది కొంతకాలం వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
జార్ఖండ్ రాష్ట్రంలో పారా టీచర్లుగా పనిచేస్తున్న వారికి 50% పోస్టులు కేటాయించి పరీక్ష నిర్వహించి నాలుగు వారాల్లో రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రభుత్వ వ్యవస్థలలో ముఖ్యంగా విద్యారంగంలో కాంట్రాక్ట్ నియామకాల ప్రక్రియను క్రమంగా తగ్గిస్తూ రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

