2023 batch jls issues

2023 batch JLs – ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లపై ప్రభుత్వం కీలక హామీ

హైదరాబాద్, జూలై 31: 2023 batch JLs issues will sortout soon. 2023లో రెగ్యులరైజ్ అయిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు ఎదుర్కొంటున్న ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు వార్షిక ఇంక్రిమెంట్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు సంకేతాలు లభించాయి.

2023 batch JLs issues will sortout soon.

ఈ మేరకు ప్రణాళిక సంఘం చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి మరియు TGEJAC చైర్మన్ శ్రీ లచ్చిరెడ్డి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి యోగిత రాణా, IAS ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా 2023లో రెగ్యులరైజ్ అయిన అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు, అలాగే ఇటీవల గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు అమలు అంశాలపై సవివరంగా చర్చించినట్లు సమాచారం.

సమావేశ సమయంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ అభిలాష్ అభినవ్, IAS కూడా హాజరై సమస్యల పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా, IAS మాట్లాడుతూ, గౌరవ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు వార్షిక ఇంక్రిమెంట్లకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు.

ఈ సమావేశంలో రెవెన్యూ సంఘాల ప్రధాన కార్యదర్శి శ్రీ పాక రమేష్, శ్రీ రాములు, తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGLA) అధ్యక్షుడు కుమారస్వామి, హైదరాబాద్ జిల్లా కోశాధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో 2023లో రెగ్యులరైజ్ అయిన అధ్యాపకుల్లో ఆశలు చిగురించాయి. హైకోర్టు తీర్పు అమలుతో పాటు ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్ల ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →