హైదరాబాద్ (ఏప్రిల్ 09) : 10 lakhs life insurance to Telangana RTC employees. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉద్యోగుల సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమా చెల్లించే విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంస్థ ఒప్పందం చేసుకుంది.
10 lakhs life insurance to Telangana RTC employees
2026 ఏప్రిల్ ఒకటి నుండి ఈ బీమా సౌకర్యం ఆర్టీసీలో పనిచేస్తున్న 38 వేల మంది ఉద్యోగులకు వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. అయితే ఉద్యోగులు కచ్చితంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేతన ఖాతాను కలిగి ఉండాలి.
ఈ 10 లక్షల బీమా కోసం ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ ప్రకటించింది.
ప్రమాదవశాత్తు మరణాలకే కాకుండా సహజ మరణాలకు కూడా 10 లక్షల రూపాయల జీవిత బీమా వర్తింప చేయడం వలన కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి.

