BIKKI NEWS (SEP. 06) : Vinayaka laddu auction price 2 31 crore in Hyderabad. ఈ ఏడాది గణనాధుని లడ్డు ధర హైదరాబాదులో 2.31 కోట్ల ధర పలికింది. ఇది ఇప్పటివరకు చరిత్రలోనే అత్యధిక ధర కావడం విశేషం.
Vinayaka laddu auction price 2 31 crore in Hyderabad
హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో ప్రతిష్టించిన వినాయకుని విగ్రహం యొక్క లడ్డు ధర ఈసారి వేలంలో 2.31 కోట్ల రికార్డు ధర పలికింది.
గతేడాది ఇదే రిచ్‌మండ్ విల్లాస్ లో లడ్డూ ధర 1.87 కోట్లు ధర పలికిన సంగతి తెలిసింది.
వేలం పాటలో వచ్చిన నగదును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఒక్క రూపాయిని కూడా సొంత ఖర్చులకు ఉపయోగించుకోరు.