BIKKI NEWS (SEP. 16) : Transfers and diputations for employees in telangana. జీవో నెంబర్ 317, 44 వలన ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులతో ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు డిప్యూటేషన్‌కి నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
Transfers and diputations for employees in telangana
తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీఓ ఎమ్‌ఎస్ నెంబర్ 190 (తేదీ: 16-09-2025) ఆధారంగా, రాష్ట్రంలో ఉద్యోగులకు తాత్కాలిక ఇన్‌టర్ లోకల్ కేడర్ ట్రాన్స్‌ఫర్/డిప్యూటేషన్ పై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది
కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల అభ్యర్థనలను పరిగణించి, అవసరమైన సిఫార్సులను ఇచ్చింది
ఉద్యోగుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, తాత్కాలికంగా ఇతర లోకల్ కేడర్‌కు డిప్యూటేషన్ అవకాశం కల్పించనుంది.
మార్గదర్శకాలు
తాత్కాలిక డిప్యూటేషన్ రెండు సంవత్సరాలకు అనుమతించబడుతుంది.అవసరమైతే మరొక సంవత్సరం పొడిగింపు
బాధిత ఉద్యోగి తిరిగి తన మాతృ కేడర్‌కు వెళ్లాలి; ఇది స్ధిరమైన మార్పు కాదు.
డిప్యూటేషన్‌కి ఎంపికైన ఉద్యోగులకు డిసిప్లినరీ చర్యలు ఉంటే, వారి దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోరు.
ఈ అవకాశానికి ఒకసారి ఎంపికైన ఉద్యోగి మళ్ళీ మరోసారి అర్హుడు కాడు.
ప్రయాణ భత్యం (TA/DA) ఇవ్వరు.
ప్రోత్సహించదగిన ఉద్యోగులను ప్రతిసారి పరిణామాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి/ప్రిన్సిపాల్ కార్యదర్శి అథారిటిగా వ్యవహరిస్తారు.
ఖాళీలున్న స్థానాల్లో మాత్రమే బదిలీ, డిప్యూటేషన్ కొనసాగుతుంది, ఇప్పటికే పదోన్నతులు పొందినవారికి ఈ అవకాశం లేదు.
ప్రతి అభ్యర్థనను తగిన పరిశీలనతో నిర్ణయిస్తారు, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి.