BIKKI NEWS (SEP. 03) : THREE DAYS HOLIDAYS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో ఈ వారంలో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఈ సెలవులు ప్రకటించారు.
THREE DAYS HOLIDAYS IN TELANGANA
ఈ నెల 5న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్రమంతా పబ్లిక్ హాలిడే ఉంది. మరుసటి రోజు శనివారం గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఉంటుందని పేర్కొంది. ఇక 7న ఆదివారం వస్తోంది.
శనివారం రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలలో కాకుండా మిగతా జిల్లాలలో సెలవు లేదు.
సెప్టెంబర్ 6న సెలవు ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ నెలలోని రెండో శనివారం రోజు వర్కింగ్ డే గా ప్రకటించారు.

