- చైర్ పర్సన్ గా దీపారెడ్డి, కన్వీనర్ గా సుజాత, కోశాధికారిగా శాంతిశ్రీ ఎంపిక
BIKKI NEWS (SEP. 21) : TGO WOMEN WING CHAIRMAN DEEPA REDDY. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘము అధ్వర్యంలో నాంపల్లి టీజీఓ భవన్ లో మహిళా గెజిటెడ్ అధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది.
TGO WOMEN WING CHAIRMAN DEEPA REDDY.
87వేలకు పైగా ఉన్న గెజిటెడ్ అధికారులలో 27 వేల మంది మహిళా అధికారులు ఉన్నారు.టీజీఓ సచివాలయ,నగర శాఖలతో పాటు 33 జిల్లాల కమిటీలు,77 అనుబంధ ఫోరంలు ఉన్నాయి.
నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా విభాగం ఏర్పాటుకు ఈ అన్ని విభాగాల నుండి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.
టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా మహిళా శాఖ ఎన్నికలను నిర్వహించారు.ఒకే సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. పరిశీలన అనంతరం 101 సభ్యులతో టీజీఓ కేంద్ర మహిళా విభాగం ను ప్రకటించారు.చైర్మన్ గా డాక్టర్ దీపారెడ్డి, కన్వీనర్ గా జక్కంపూడి సుజాత, కోశాధికారిగా శాంతిశ్రీ గా ఎన్నికయ్యారు .
నూతన మహిళా గెజిటెడ్ అధికారుల శాఖ కార్యవర్గంతో టీజీఓ అధ్యక్ష్యుడు ఏలూరి శ్రీనివాసరావు నియామక పత్రాలను అందించి ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర లో మహిళలు పాలనలో ,ఉత్పాదక రంగంలో, ఉద్యమాలలో,ఉద్యోగ విధులలో, సంస్కృతి సృష్టిలో విశేష పాత్ర పోషించారని అన్నారు.ఈ వారసత్వ కొనసాగింపులో మహిళా గెజిటెడ్ అధికారులు మరింత క్రియాశీలంగా పని చేయాలని కోరారు.ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి 2030 లక్ష్యమైన లింగ సమానత్వం సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాల ప్రచారం ,అమలు ప్రక్రియలో అగ్రగాములుగా పని చేయాలని కోరారు విద్యలో,ఉపాధి కల్పనలో ,పని చేసే ప్రదేశాలలో బాలికలు,మహిళల పట్ల ఇంకా కొనసాగుతున్న వివిధ రూపాల వివక్షతను,అణచివేతను తొలగించడంలో చురుకుగా పని చేయడమే సాంఘిక సంస్కర్తలకు ,రాజ్యాంగ రూపకర్తలకు ఇచ్చే నిజమైన గౌరవం కృతజ్ఞత అని అన్నారు.
టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ
ఆర్థిక వనరులపై మహిళలకు సమాన హక్కులను పొందినప్పుడు ఆ ఉత్పాదక ఫలితాలను సమాజానికి అందించడం లో ముందుంటారని అన్నారు.స్వయం స్వాలంబన సాధికారత కోసం మహిళా గెజిటెడ్ అధికారులు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేయాలని పిలుపునిచ్చారు
మహిళా శాఖ చైర్ పర్సన్ దీపారెడ్డి అధ్వర్యంలో పలు తీర్మానాలను కార్యవర్గం ఆమోదించింది.
1.సమాజంలో సగభాగమైన మహిళల అభివృద్ధికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలి.
2.చైల్డ్ కేర్ సెలవులను 180 రోజులు ఇవ్వాలి.ఈ సమయంలో రెగ్యులర్ గా జీతం అందించాలి.
4) నెలసరి సమయంలో ప్రతి కార్యాలయంలో విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలి.
4.చిన్న పిల్లల సంరక్షణకు క్రెష్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
5.మహిళా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి.
6.మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే పండుగలు జాతరలకు ప్రత్యేక ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలి.
7.ప్రతి ప్రభుత్వ విభాగంలో మహిళా ఉద్యోగుల వివక్షత,వేధింపుల నిరోధం కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలి.
8.సైన్స్ ,సాంకేతికత,ఇంజనీరింగ్ ,కృత్రిమ మేధ రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడం కోసం ప్రత్యేక కృషి చేయాలి.