TGEJAC – ప్రభుత్వం పై సమరశంఖం పూరించిన ఉద్యోగ జేఏసీ

BIKKI NEWS (AUG. 19) : TGEJAC ACTION PLAN FOR EMPLOYEES DEMANDS. ఉద్యోగ సంఘాల జేఏసీ ఈరోజు హైదరాబాద్ లో సమావేశమై ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై సుమారు శంఖం పూరించారు.

TGEJAC ACTION PLAN FOR EMPLOYEES DEMANDS

సెప్టెంబర్ 01 నుండి అక్టోబర్ 12 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు ప్రకటించారు.

సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సు హైదరాబాదులో తెలుగు లలిత కళాతోరణం పబ్లిక్ గార్డెన్స్ నందు సాయంత్రం 3:00 గంటల నుండి, వేలాదిమంది ఉద్యోగుల భాగస్వామ్యంతో పోరాట సదస్సు నిర్వహణతోపాటు 33 జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు..

సెప్టెంబర్ 8 నుండి 19 వరకు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు.

అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయించింది.

ఉద్యోగుల ప్రధాన సమస్యలు.

1) పెండింగ్ లో ఉన్న 5 కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.

2) ఆరోగ్య రక్షణ పథకాన్ని (EHS) జూలై నెల ఆఖరులోపే పూర్తిస్థాయిలో నిబందనలనురూపొందించి అమలు చేయాలి.

3) క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు 700 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి.

4) కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

5) ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేయుటకు తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి.

6) 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మేమో ద్వారా పాత పెన్షన్ అమలు చేయాలి.

7) పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి.

8) వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

9) గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటా-యించాలి

10) స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి.

11) రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే మిగితా పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలి.

12) నూతనముగా ఏర్పడిన మండలాలకు (MPP) మరియు MEO పోస్టులను మంజూరు చేయాలి

13) S.S.A ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని మంజూరు చేయాలి.

14) సెప్టెంబర్ 1 ని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు జిల్లా కేంద్రాలలో జరుపుతాం.