- BIKKI NEWS : 31-01-2026
TG EAPCET 2026 MARKS DISPLAY AFTER EXAM. తెలంగాణ ఈఏపీ సెట్ 2026 కు సంబంధించి షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు సంబంధించి పలుకేలక నిర్ణయాలను తీసుకున్నారు.
TG EAPCET 2026 MARKS DISPLAY AFTER EXAM
ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష రాసిన విద్యార్థులు పరీక్ష పూర్తయిన తర్వాత సబ్మిట్ కొట్టగానే స్క్రీన్ స్క్రీన్ ఆటోమేటిక్ షట్ డౌన్ అవుతుంది. ఒక నిమిషం తర్వాత వచ్చిన ప్రాథమిక మార్కులను స్క్రీన్ మీద చూపిస్తుంది.
అయితే ఈ మార్కులు తుది మార్కులు కాదు, కేవలం ప్రాథమిక మార్కులు మాత్రమే. ప్రాథమిక కీలు అభ్యంతరాలు తెలిపిన తరువాత తుదికి విడుదల చేసి ఫలితాలను విడుదల చేస్తారు.
ఫిబ్రవరి 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్లో కూడా దరఖాస్తు చేసుకునేలా ఈసారి అప్లికేషన్ ఫార్మాట్ ను మార్చనున్నారు.
మే 4 నుండి 11వ తేదీ వరకు ఈఏపీ సెట్ పరీక్షలు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

