BIKKI NEWS (NOV. 01) : TET COMPULSORY FOR SPECIAL EDUCATION TEACHERS SAYS HIGH COURT. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ టెట్ అర్హత తప్పనిసరి అని హైకోర్టు తాజాగా సెప్టెంబర్ 31న స్పష్టం చేసింది.
TET COMPULSORY FOR SPECIAL EDUCATION TEACHERS SAYS HIGH COURT
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లో (భవితా కేంద్రాలలో పని చేస్తున్న టీచర్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కేడర్లలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకంలో టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కేంద్ర పునరావాస మండలి నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు టెట్ అర్హతను ఉండాలంటూ జారీ చేసిన జీవో 4 రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్ తప్పనిసరి అని, వారికి మినహాయింపు ఉండదని తెలిపారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

