- BIKKI NEWS : 26-01-2026
TET 2026 NO NORMALIZATION. తెలంగాణ టెట్ ఫలితాల్లో ఈసారి ‘నార్మలైజేషన్’ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. జిల్లాకు ఒకే సెషన్ చొప్పున పరీక్ష నిర్వహించడంతో నార్మ లైజేషన్ అవసరం లేదని అధికారులు తెలిపారు .
TET 2026 NO NORMALIZATION
ఆన్లైన్ పరీక్షలు కావడంతో నార్మలైజేషన్ ఉంటుందన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
జిల్లాకు ఒకే సెషన్
సాధారణంగా ఆన్లైన్ పరీక్షలు వేర్వేరు సెషన్ల లో జరిగినప్పుడు.. ఒక పేపర్ కఠినంగా, మరో పేపర్ సులభంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దీంతో అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు ‘నార్మలైజేషన్’ చేస్తారు.
అయితే ఈసారి టెట్ పరీక్షలను ప్రతి జిల్లా అభ్యర్థులకు ఒకే సెషన్ లో పరీక్షలను నిర్వహించారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులందరికీ ఒకే రకమైన క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఎవరికీ అన్యాయం జరగలేదని, అందుకే నార్మలైజేషన్ అవసరం లేదని విద్యాశాఖ నుండి సమాచారం.
ఈ నెల 30న టెట్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

