BIKKI NEWS (AUG. 30) : Telangana farmers will receive Urea soon. 49,275 టన్నుల యూరియను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం త్వరలోనే పంపనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యూరియాను డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
Telangana farmers will receive Urea soon
అయితే సెప్టెంబరు నెలకు ఇప్పటికే ఆమోదించిన 1.50 లక్షల టన్నుల సరఫరాకు అదనంగా మరో 2.38 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రం పై ఒత్తిడి తెస్తున్నామని, తెలిపారు .
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యూరియా నిల్వలు కేవలం 30,000 టన్నులు మాత్రమేనని, రోజుకు 9,000 నుంచి 11,000 టన్నుల మేరకు అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.