- BIKKI NEWS : 18-01-2026
Telangana cabinet decisions today january 18th. , మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో భేటీ అయినా తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. మొత్తం 18 అంశాలపై క్యాబినెట్ చర్చిస్తుంది.
Telangana cabinet decisions today january 18th.
మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి , ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది..
మేడారంలో శాశ్వత భవనాలు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయం
జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని క్యాబినెట్ నిర్ణయం.
పొట్లపురం ఎత్తిపోతల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 143 కోట్ల రూపాయల కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
జంపన్న వాగులో నిరంతరం నీళ్ళు ఎప్పుడూ నిలిచి ఉండేలా రామప్ప నుండి లక్నవరం అక్కడినుంచి జంపన్న వాగు లోకి కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి నిధులు మంజూరు
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు ఇప్పటికి నుండి పనులు ప్రారంభించాలని, జిల్లాకు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయం.
బాసర నుండి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్, టూరిజం డెవలప్మెంట్ కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మెట్రో పేజ్ 2 కు సంబంధించిన భూసేకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది 2787 కోట్లు కేటాయించడం జరిగింది.
హైదరాబాద్ లో 9 కి.మీ ఫ్లైఓవర్ కు కేబినెట్ ఆమోదం. ట్రిపుల్ ఐటీ నుండి శిల్పా లేఔట్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం.
గ్రామీణ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం. 2 సంవత్సరాలలో అన్ని రోడ్లను సిమెంట్ రోడ్లు గా అభివృద్ధి చేయాలని నిర్ణయం.
20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్న తమ ప్రభుత్వం… మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో లా కాలేజీ ఏర్పాటు కు ఆమోదం, 24 పోస్టుల మంజూరు కు ఆమోదం. ఫార్మా కాలేజీ కి ఆమోదం. 28 పోస్టుల మంజూరు.


