BIKKI NEWS (SEP. 05) : Teachers day September 5th. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం రోజు సెప్టెంబర్ 5న ప్రతి ఏడాది జరుపుకుంటారు.
Teachers day September 5th.
ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబరు 5వ తేదీన జరుపుకుంటారు.
మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము.