TEACHERS – టెట్‌ నుంచి మినహాయింపు కోసం సుప్రీంలో రివ్యూ పిటిషన్

BIKKI NEWS (SEP. 18) : Teachers are demanding for exempt them from TET. సర్వీస్‌ లో ఉన్న టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్‌ ఎమ్మెల్సీలు, తపస్‌, పీఆర్టీయూ టీఎస్‌ వంటి ముఖ్యమైన సంఘాలు కోరాయి.

Teachers are demanding for exempt them from TET

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఈ సందర్భంగా కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని సీఎంవో కార్యదర్శి శేషాద్రిని సీఎం ఆదేశించినట్టు ఎమ్మెల్సీలు ప్రకటించారు.

యూటీఎఫ్‌, ఎస్టీఎఫ్‌ఐ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని నిర్ణయించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు.