యాస- శ్వాస : కాళోజీ జయంతి ప్రత్యేక కవిత

Special poem by addagudi umadevi on kaloji jayanti

BIKKI NEWS (SEP. 09) : Special poem by addagudi umadevi on kaloji jayanti.
కాళోజీ జయంతి సందర్భంగా ప్రముఖ కవయిత్రి అడ్డగూడి ఉమాదేవి వ్రాసిన ప్రత్యేక కవిత…

Special poem by addagudi umadevi on kaloji jayanti.

సమాజ వివక్షతను,దరిద్రుని దైన్యాన్ని
అక్షరాలతో కడిగిన నిప్పు కణం-కాళోజీ
కుళ్ళు రాజకీయ కుట్రలను చూస్తూ ,ఎద భావాలకు మాటలద్ది నిలదీసిన
ఉక్కు కొలిమి–కాళోజీ

నిజాం నాజీ ప్రవృత్తులపై
తిరుగుబాటు బావుటా జులిపిన
ధైర్యగళం—కాళోజీ

ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిపాలించే కుహనాసంస్కారులను
ప్రాంతంలోనే పాతిపెట్టమనే
శౌర్యబలం–కాళోజీ

ఎన్నుకున్నవాడు ఇదివరకు వెలగబెట్టిందేమిటని
నిక్కచ్చిగా నిలదీసే మాటల తూటా –కాళోజీ

మానవాధములను కాలంబు రాగానె కాటేసి తీరాలనిచెప్పే
అరివీరభయంకరుడు–కాళోజీ

పలుకుబడుల భాషకంటె ముఖ్యమైన భాషేదని
తెలంగాణ ఊపిరియై, మనయాసే తన శ్వాసై
తుదివరకు నిలిచిన
ధిక్కార గళం–కాళోజీ

అడ్డగూడి .ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
వరంగల్
9908057980