GJC WYRA – వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 3 కోట్లు కేటాయింపు

Gjc wyra - వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 3 కోట్లు కేటాయింపు - bikki news
  • BIKKI NEWS : 20-01-2026

Sanctioned 3 crores to GJC Wyra. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వైరాకు అదనపు గదుల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Sanctioned 3 crores to GJC Wyra

ప్రభుత్వ జూనియర్ కళాశాల వైరాకు 18 అదనపు గదుల నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ ఇంటర్మీడియట్ బోర్డును సూచించింది.

గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ భట్టి విక్రమార్క మరియు గౌరవ వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ కి తెలిపిన ప్రిన్సిపాల్ అండ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.

వైరా పట్టణంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులు సరిపోక శిధిలావస్థలో ఉన్న బిల్డింగులతో ఇబ్బంది పడుతున్న దశలో ప్రిన్సిపాల్ యల్. నవీన్ జ్యోతి ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది గౌరవ ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ బట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఈరోజు ఉన్నత విద్యాశాఖ నిధులు శాంక్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది*

ఈరోజు వైరా పట్టణం విచ్చేసిన ఉపముఖ్యమంత్రి వర్యులు సంబంధిత జీవోను కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ నవీన జ్యోతి గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది మరియు విద్యార్థులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ లకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →