BIKKI NEWS (JULY 21) : Ration cards distribution date in telangana. రేషన్ కార్డుల పంపిణీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 10వ తేదీ లోపు రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.
Ration cards distribution date in telangana
రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించా7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. పాత రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడంతో సహా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తంగా 96.95 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటి ద్వారా 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ ఉన్నప్పుడు అంత డిమాండు లేదు. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినప్పటి నుంచి రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
రేషన్ కార్డుల జారీపై ఈ నెల 25 వ తేదీ నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు జిల్లా ఇంచార్జీ మంత్రులు, జిల్లా మంత్రులు అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలి. ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక మండల కేంద్రంలోనైనా కచ్చితంగా కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి. దాదాపు 15 రోజుల పాటు కార్యక్రమాల కోసం ఒక షెడ్యూలు తయారు చేసుకుని పర్యవేక్షించాలి.