Robot Sarogacy – పిల్లలను కనే రోబో

BIKKI NEWS (AUG. 18) PREGNANCY HUMANOID ROBOT. శిశువులకు జన్మనిచ్చే రోబో లను చైనా అభివృద్ధి చేయడంలో కీలక ముందడుగు వేసింది. ప్రెగ్నెన్సీ హుమనాయిడ్ రోబోల అభివృద్ధి తో కృత్రిమ గర్భం తో శిశువులకు జన్మ ఇవ్వనున్నాయి.

PREGNANCY HUMANOID ROBOT.

డాక్టర్ జాన్ కీపెంగ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఈ ప్రెగ్నెన్సీ రోబోను అభివృద్ధి చేస్తున్నారు.

కృత్రిమ గర్భధారణ నుంచి శిశువు జననం వరకు ఈ రోబో లోని కృత్రిమ గర్భసంచి లోనే జరగనుండటం విశేషం. ఈ కృత్రిమ గర్భసంచిలో ఆమ్నియోటిక్ ద్రవాన్ని నింపి సహజ గర్భం యొక్క వాతావరణాన్ని సృష్టించనున్నారు.

దీంతో సరోగసి (Robot Sarogacy) అనేది భవిష్యత్తులో రోబోలతో ముడిపడనుంది. ఆర్టిఫిషియల్ ఊంబ్ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో కీలకంగా మారనుంది.

ఈ కృత్రిమ గర్భాన్ని సృష్టించడానికి దాదాపు 13 లక్షల వరకు ఖర్చు అవుతున్నట్లు సమాచారం.