Scholarship : 6 – 9వ తరగతి విద్యార్ధులకు పోస్టల్ స్కాలర్షిప్

BIKKI NEWS (AUG. 21) : Postal scholarship for school students. భారత పోస్టల్ శాఖ దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్ షిప్- 2025-26 కు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.

Postal scholarship for school students.

6వ తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం : చరిత్ర, క్రీడలు, సాంఘికశాస్త్రం, సామాన్యశాస్త్రం, జనరల్ నాలెడ్జ్, స్టాంపులు వంటి సబ్జెక్టుల్లో విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తారు. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం (ఫిలాటలీ)తో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించేందుకు ఏటా తపాలా శాఖ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.

స్కాలర్షిప్ విలువ : ఒక్కో తరగతి నుంచి 10 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 40 మందిని ఎంపిక చేస్తారు. వారికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల స్కాలర్షిప్ ను అందిస్తారు.

వెబ్సైట్ : https://www.indiapost.gov.in/