POLYCET SEAT ALLOTMENT : పాలిసెట్ తొలి విడత సీట్ల కేటాయింపు

BIKKI NEWS (JULY 16) : Polycet 2025 seat allotment. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ మొదటి సీట్లు కేటాయించారు.

Polycet 2025 seat allotment

మొదటి విడతలో మొత్తం 18,984 మంది సీట్లు పొందారని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. సీట్లు సాధించిన అభ్యర్థులు జూలై 18వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.

రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత మాత్రమే వారు స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.

ఐదు ప్రభుత్వ, ఒక ప్రైవేట్ కళాశాలలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 10,012 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి బోధనా రుసుములు చెల్లిస్తారు. మిగిలిన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.14,900 మాత్రమే ఫీజు రీయింబర్స్మెం ట్ గా చెల్లించనున్నారు.

వెబ్సైట్ : https://tgpolycet.nic.in/Default.aspx