BIKKI NEWS (DEC. 26) : PENDING DA AREARS TOTAL VALUE.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందించాల్సిన డీఏ లు పేరుకుపోయాయి.
PENDING DA AREARS TOTAL VALUE
ప్రస్తుత వివరాల ప్రకారం జనవరి -2023 వరకు మనకు DA మంజూరైంది. ఆ తర్వాత నుండి ఇప్పటివరకు మొత్తం 5 విడతల DA మంజూరు చేయాల్సి ఉంది.
మొదటి బకాయి విడత (జూలై-2023) నుండి లెక్కగడితే, ఈ డిసెంబర్ 2025 ఆఖరి నాటికి మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన 5 DA బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
శాతాల పరంగా చూస్తే, మొత్తం 14.56% DA ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సి ఉంది. వచ్చే జనవరి (2026) నుండి 6వ విడత కూడా బకాయిల జాబితాలోకి చేరుతుంది.
మొత్తం బకాయిలు : డీఏ బకాయిలను సుమారుగా లెక్కిస్తే (విడత అమల్లోకి వచ్చిన తేదీ నుండి)- డిసెంబర్ 2025 నాటికి విడతల వారీగా ₹70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి రావాల్సిన DA బకాయిల వివరాల ప్రకారం ఈ ఐదు విడతలు కలిపి మొత్తం 14.56% DA బకాయి ఉంది. దీనివల్ల ప్రతి నెల జీతంలో ₹10,192 పెరుగుదల కనిపిస్తుంది. ఇప్పటివరకు పేరుకుపోయిన మొత్తం బకాయిలు ₹1,98,744 గా ఉన్నాయి.

