BIKKI NEWS (JULY 13) : Open 10th and inter admissions 2025. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు గడువును జూలై 31 వరకు పెంచింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Open 10th and inter admissions 2025
ఇలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు జూలై 31 వరకు ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆలస్య రుసుముతో ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పాఠశాలకు, కళాశాలకు వెళ్లలేని అభ్యర్థులు, గృహిణిలు మరియు ఉద్యోగం చేస్తున్న వారు ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అనేది చక్కని అవకాశం.
ఈ సర్టిఫికెట్లు సాధారణ పదో తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో సమానత్వం కలిగి ఉంటాయి.
వెబ్సైట్ : https://toss.aptonline.in/TOSS/UI/StudentForms/HomePage.aspx