ONGC SCHOLARSHIP 2025 : 30 వేల వరకు స్కాలర్షిప్

BIKKI NEWS (SEP. 21) :ONGC SPORTS SCHOLARSHIP 2025. 2025 – 26 సంవత్సరానికి గాను, ఓఎన్జీసీ 21 క్రీడా విభాగాలలో పురుష మరియు మహిళా క్రీడాకారుల కోసం, నెలకు రూ. 15,000/- నుండి రూ. 30,000/- వరకు ఉండే 250 క్రీడా స్కాలర్ షిప్ లను అందించడానికి ప్రకటన విడుదల చేసింది.

ONGC SPORTS SCHOLARSHIP 2025

ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 21 సాయంత్రం 04 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు .

ఈ స్కాలర్షిప్ కు 15 నుండి 20 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు అర్హులు,

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి ..

దరఖాస్తు చేయడానికి ముందు, పోర్టల్లో ఇవ్వబడిన పథకం వివరాలను మరియు నిబంధనలు, షరతులను తప్పకుండా చదవగలరు..

ఒకవేళ అభ్యర్థి నకిలీ ధృవపత్రాలను సమర్పించినట్లయితే, దరఖాస్తు తిరస్కరించబడుతుంది మరియు అటువంటి అభ్యర్థులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని ONGC తెలిపింది.

వెబ్సైట్ : https://sportsscholarship.ongc.co.in