BIKKI NEWS (NOV. 18) : old pension not possible to Regularized employees. తాత్కాలిక, కాంట్రాక్టు, అడహాక్, దినసరి వేతన, ఎన్ఎంఆర్ లేదా కంటిజెంట్.. ఏ పేరుతో తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసినా, వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించిన తర్వాత పాత సర్వీసును లెక్కించి పాత పింఛన్ విధానం అమలు చేయాలని అడగడం సరికాదని ఆర్థికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
old pension not possible to Regularized employees
ఈ మేరకు ఉద్యోగ నియామకాలు, సర్వీసుల హేతుబద్ధీకరణ, వేతన విధానం చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికశాఖ ప్రతి పాదనలు పంపింది.ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1994లో ఈ చట్టం తెచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్నే అమలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో సైతం 1994 చట్టానికి సవరణ చేసినట్లు తెలిపింది.
2004 సెప్టెంబరు 1 తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి నూతన పింఛను విధానం అమల్లోకి వచ్చింది. అయితే అంతకుముందు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసినవారిని ఆ తేదీ తర్వాత క్రమబద్ధీకరిస్తే.. వారు ముందు సర్వీసును కూడా లెక్కించి పాత పింఛన్ పథకంలో చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. సవరించిన పింఛన్ నియమావళి-1980లో స్పష్టత లేదని.. క్రమబద్ధీకరించిన ఉద్యోగులకు పాత పింఛన్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తోంది.
ఈ నేపథ్యంలో 2004 సెప్టెంబరు ఒకటో తేదీకి ముందు.. . ఇలా క్రమబద్ధీకరించిన వారందరికీ పాత పింఛన్ వర్తింపజేస్తే.. ప్రభుత్వంపై రూ.20 వేల కోట్ల వరకూ అదనపు ఆర్థికభారం పడుతుందని అంచనా వేసింది.
తాత్కాలిక ఉద్యోగ కాలాన్ని పింఛన్ లేదా సర్వీస్ బెని ఫిట్స్ కోసం లెక్కించరాదంటూ.. సుప్రీంకోర్టు 2023 మార్చి 3న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఈ మేరకు చట్టానికి సవరణతో ఆర్డినెన్స్ జారీచేయాలని సూచించింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

