BIKKI NEWS (JAN. 03) : NEW YEAR NEW RULES 2026. కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నియమాలు మారాయి. ముఖ్యమైనవి సంక్షిప్తంగా చూద్దాం.
NEW YEAR NEW RULES 2026
పాన్ – ఆధార్ లింక్ తప్పనిసరి*
డిసెంబర్ 31 గడువు ముగిసింది. లింక్ చేయకపోతే పాన్ చెల్లదు. ₹1000 జరిమానాతో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లింక్ చేయాలి.
UPI & SIM నిబంధనలు కఠినం
ఆన్‌లైన్ మోసాల నివారణకు UPI ట్రాన్సాక్షన్లపై నిఘా
WhatsApp / Telegram / Signal కోసం SIM వెరిఫికేషన్ కఠినతరం
డెబిట్ / క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
SBI, HDFC, ICICI బ్యాంకుల్లో రివార్డ్స్, లాంజ్ యాక్సెస్, ఫీజుల్లో మార్పులు
క్రెడిట్ స్కోర్ అప్డేట్ వేగంగా
ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి, ఇకపై ప్రతి వారం అప్డేట్, EMI మిస్ అయితే వెంటనే ప్రభావం
కొత్త ఆదాయపు పన్ను చట్టం
Income Tax Act – 2025 అమలు: 1 ఏప్రిల్ 2026 నుంచి
వాహన ధరలు పెరుగుతాయి
కార్ల ధరలు జనవరి 1 నుంచే పెంపు. Hyundai, Renault, MG, Mercedes, BMW తదితర కంపెనీలు
ఎలక్ట్రానిక్స్ ఖరీదు పెరుగుతుంది
- ACలు: ~10% పెరుగుదల
- ఫ్రిడ్జ్‌లు: ~5% పెరుగుదల
గ్యాస్ ధరలు : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు.

