NAVODAYA IX ADMISSIONS- నవోదయ 9వ తరగతి అడ్మిషన్లు

BIKKI NEWS (AUG. 22) : NAVODAYA IX CLASS ADMISSIONS 2026. నవోదయ విద్యాలయ సమితి లో దేశవ్యాప్తంగా 2026 27 విద్యా సంవత్సరం కొరకు తొమ్మిదవ తరగతిలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం లేటలల్ ఎంట్రీ ఎంట్రన్స్ టెస్ట్ (NVS LEST 2026) ప్రవేశ పరీక్షకై నోటిఫికేషన్ జారీ అయింది.

NAVODAYA IX CLASS ADMISSIONS 2026.

దేశవ్యాప్తంగా ఉన్న 653 నవోదయ విద్యాలయ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న తొమ్మిదవ తరగతి సీట్లను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.

ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 23 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు

మే 1 – 2011 నుండి జులై 31 – 2013 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులు.

మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ సబ్జెక్టులు ఉంటాయి.

ఫిబ్రవరి 7 – 2026న ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు

వెబ్సైట్ : https://cbseitms.nic.in/2025/nvsix_9?AspxAutoDetectCookieSupport=1