ఇంటర్మీడియట్ విద్యలో డిజిటల్ విప్లవం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇంటర్మీడియట్ విద్యలో డిజిటల్ విప్లవం - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - bikki news

BIKKI NEWS (OCT. 11) : Minister Laxman kumar visited intermediate board. ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల గౌరవ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) లోని కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యత, జవాబుదారీతనం పెంచేందుకు సాంకేతికతను వినూత్నంగా ఉపయోగించడం పట్ల ఆయన TGBIE ని అభినందించారు.

Minister Laxman kumar visited intermediate board

పేద, అణగారిన వర్గాలకు చెందిన యువతకు ఉత్తమ నాణ్యత గల విద్య అందించాలనే ముఖ్యమంత్రి పటిష్ట సంకల్పాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. గురుకులాలు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆదునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు మరియు డిజిటల్ అభ్యాస అవకాశాలు కల్పించేందుకు గణనీయంగా కృషి చేస్తామని ప్రకటించారు.

TGBIE డిజిటల్ వ్యవస్థ- ఇందులో సీసీటీవీ పర్యవేక్షణ, ఫిషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) మరియు పారదర్శకత, జవాబుదారీతనాన్ని మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ (HRMS) ఉన్నాయి పెంచుతున్నాయని మంత్రి కొనియాడారు.

సానుకూల ఫలితాలనిస్తున్న ముఖ్య చర్యలు:

రోజు వాట్సాప్ అటెండెన్స్:
విద్యార్థుల హాజరు, క్రమశిక్షణను పెంచేందుకు ప్రతిరోజు వారి హాజరు వివరాలను నేరుగా తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు.

IVRS ఫిర్యాదుల పరిష్కారం: కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా విద్యార్ధులు తమ సమస్యలను సులభంగా నమోదు చేసుకుని, పరిష్కరించుకునే అవకాశం ఉంది.

TGBIE సెక్రటరీ శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీటీవీ మరియు FRS ఉపయోగించి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను రియల్ టైమ్ లో ఎలా పర్యవేక్షిస్తున్నారో మంత్రికి వివరించారు.

ప్రస్తుతం తెలంగాణలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సీసీటీవీ కవరేజీతో పూర్తిగా అనుసంధానం అయ్యాయని సెక్రటరీ తెలిపారు. మొత్తం 1,61,233 మంది విద్యార్ధులు ఉండగా, 1,44,530 మంది FRS వ్యవస్థలో నమోదు చేసుకున్నారు. విద్యార్ధుల హాజరు, పురోగతి పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి, పది మంది ప్రత్యేక అధికారులను నియమించి, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కళాశాలలను పర్యవేక్షిస్తున్నారు.

చదువుతో పాటు విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి శనివారం యోగా, ధ్యానం సెషన్లు, క్రమం తప్పకుండా క్రీడా కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ శ్రీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →