BIKKI NEWS (JULY 14) : LORDS TEST INDIA vs ENGLAND. టెందుల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ (IND VS ENG) మూడవ టెస్ట్ చివరి రోజు కీలక దశకు చేరుకుంది.
LORDS TEST INDIA vs ENGLAND.
భారత్ చేతిలో ఆరు వికెట్లు ఉండగా విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. ఇంగ్లాండ్ 6 వికెట్ల దూరంలో విజయానికి ఉంది.
ఇంగ్లాండ్ జట్టును రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేశారు. వాషింగ్టన్ సుందర్ 4, బుమ్రా, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్, కరణ్ నాయర్, కెప్టెన్ గిల్ , నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్ లు అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ 33 పరుగులతో గ్రీసులో ఉన్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 58/4 తో ఉంది.