LEAVES – ఇక HRMS PORTAL లోనే లీవ్ అప్లికేషన్

LEAVE APPLICATION IN HRMS PORTAL ONLY IN INTERMEDIATE EDUCATION

BIKKI NEWS (SEP. 08) : LEAVE APPLICATION IN HRMS PORTAL ONLY IN INTERMEDIATE EDUCATION. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని అన్ని కార్యాలయాలు మరియు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది HRMS PORTAL లోనే ఏ విధమైన లీవ్ కోసమైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE APPLICATION IN HRMS PORTAL ONLY IN INTERMEDIATE EDUCATION.

CL, EL, OH, EOL, HPL, MATERNITY LEAVE, PATERNITY LEAVE, CHILD CARE LEAVE మరియు ఇతర ఏ లీవ్ లైన ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా శాఖ నుండి తాజాగా కీలక నిర్ణయం వెలువడింది. ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయాలు, నోడల్ ఆఫీసర్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, BIE & CIE సిబ్బంది, RJDIE, DIEO అధికారులతో పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ విధ్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

  • HRMS Leave Module ను ప్రారంభించారు. ఇకపై అన్ని లీవ్ దరఖాస్తులు HRMS (ie-hrms.telangana.gov.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో చేయాలి.
  • మాన్యువల్ లీవ్ అర్జీలు ఇకపై స్వీకరించరు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తప్పనిసరి అమలు.
  • లీవ్ మాడ్యూల్‌లో ప్రతి ఉద్యోగి యొక్క లీవ్ బ్యాలెన్స్ వివరాలను ప్రిన్సిపాళ్లు, డిజిటల్‌గా, ఖచ్చితంగా నమోదు చేయాలి. ఒక్కసారి నమోదు చేసిన తర్వాత మార్పు చేయడానికి అవకాశం ఉండదు కనుక జాగ్రత్తగా చేయాలి.
  • మొదటి లాగిన్ తర్వాత సురక్షితంగా పాస్‌వర్డ్ మార్చుకోవాలి.
  • లీవ్ మాడ్యూల్ యూజర్ మ్యాన్యువల్‌ను పూర్తిగా చదివి వాడకానికి ముందు వివరాలు తెలుసుకోవచ్చును.
  • ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినచో, HRMS Support Form ద్వారా వివరాలు (కాలేజీ పేరు, కోడ్, సమస్య వివరాలు, స్క్రీన్‌షాట్) పంపితే, టెక్నికల్ టీం సహాయం అందిస్తుంది.

అధికారులకు సూచనలు

అన్ని జూనియర్ కళాశాలల్లో డేటా ఎంట్రీ పర్యవేక్షించాలి. ప్రిన్సిపాళ్లకు అవసరమైన మార్గనిర్దేశం ఇవ్వాలి. పూర్తి నివేదికను డైరెక్టర్ కార్యాలయానికి సమర్పించాలి.

  • త్వరలో HRMS ద్వారా LPC, NOCs వంటి ఇతర మాడ్యూల్స్ కూడా లైవ్ చేయబోతున్నాయి. వాటికి సంబంధించి వేరు ప్రకటనలు విడుదల చేయనున్నారు
  • అన్ని ఉద్యోగులు, సంబంధిత అధికారులు ఈ ప్రకటనను అత్యవసరంగా పరిగణించి, తప్పనిసరిగా ప్రతిస్పందించాలి.