మహిళా సంఘాల తరహాలో కిశోర బాలిక సంఘాలు – మంత్రి సీతక్క

BIKKI NEWS (SEP. 16) : KISHORA BALIKA GROUPS IN TELANGANA. 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు జీవితంలో అత్యంత కీలక దశ అని, ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశ అని, అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఈ దశ అత్యంత సంక్లిష్టమైనదని, ఈ సమయంలో సరైన దారి చూపితే బాలిక సమాజానికి మార్గదర్శకురాలవుతుందని అందుకే మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

KISHORA BALIKA GROUPS IN TELANGANA

కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటారని, బాల్య వివాహాలు, చదువును ఆపేయడం, రక్తహీనత, పోషకార లోపం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటారని, ఈ సమస్యలు కౌమార బాలిక ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని, ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారత అని,మీ తెలిపారు ‌

కిశోర బాలికల భద్రత, పోషకాహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కావాలంటే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని, సంఘాల ఏర్పాటులో drdo లు, dwo లు కలిసి పని చేయాలని, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు తో వారి సమస్యలు తెలుసుకుని అవగాహన కార్యక్రమాలు చేసే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు.

కిశోర బాలికల సంఘాలు ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టవచ్చని, మహిళా స్వయం సహాయక బృందాలకు కిశోర బాలికల సంఘాలను అనుసంధానం చేయాలని, SHG లు అన్ని వ్యాపారాల్లో రాణిస్తున్నారని, ఆర్థిక స్వావలంభనతో పాటు సామాజిక భద్రతను పొందగలుగుతున్నారని, కిషోర బాలిక సంఘాలను బలోపేతం చేస్తే.. వారి సమస్యలన్నీ సమసి పోతాయని అన్నారు.

పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో బాలికలు సమస్యలు వేరువేరుగా ఉంటాయని, సమస్యలను బట్టి నివారణ చర్యలను చేపట్టాలని, కిశోర బాలికలల్లో నైపుణ్యం పెంపొందించే దిశలో అధికారులు పనిచేయాలని, గ్రామాల వారిగా అధికారులు కిశోర బాలికల సంఘాలను ఏర్పాటుచేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు .