BIKKI NEWS (DEC. 30) : JEE ADVANCED 2026 Schedule. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది.
JEE ADVANCED 2026 Schedule
మే 17న జేఈఈ అడ్వాన్స్డ్-2026 పరీక్ష నిర్వహిస్తారు.
ఏప్రిల్ 28వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు
జేఈఈ మెయిన్స్ లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఆడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
పూర్తి షెడ్యూల్.
- ఏప్రిల్ 6- మే 2 వరకు: విదేశీయులు, భారతీయ సంతతి విద్యార్థులకు నేరుగా రిజిస్ట్రేషన్ అవకాశం
- ఏప్రిల్ 23- మే 2వ తేదీ వరకు: మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి రిజిస్ట్రేషన్ గడువు
- మే 11-17వ తేదీ వరకు: హాల్ టికెట్లు (అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ చేసుకోవడం
- మే 17వ తేదీ: పరీక్ష నిర్వహణ (ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్ – 2)
- మే 21: రెస్పాన్స్ షీట్స్ వెబ్ సైట్ లో ఉంచుతారు.
- మే 25వ తేదీ: ప్రాథమిక కీ విడుదల
- మే 25- 26వ తేదీ వరకు: ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకారం
- జూన్ 1 ఉదయం 10 గంటలకు: తుది కీ విడుదల, ర్యాంకుల వెల్లడి
- జూన్ 2వ తేదీ నుంచి జోసా కౌన్సెలింగ్
జూన్ 1వ తేదీన అడ్వాన్స్డ్ ఫలితాలు వెల్లడవుతున్నందున ఆ మరుసటి రోజు 2వ తేదీ నుంచి ఐఐటీలు, ఎన్ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలకు కలిపి జాయింట్ సీట్ అలకేషన్ ఆధారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
జూన్ 4వ అర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
అడ్వాన్స్డ్ లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే అర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. అందుకు జూన్ 4వ తేదీన ఆ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు జూన్ 7న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

