BIKKI NEWS (AUG. 27) : Intermediate public exams in January 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలోనే నిర్వహించాలని ప్రాథమికంగా బోర్డ్ నిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం.
Intermediate public exams in January 2026.
ఇప్పటివరకు ఇంటర్ వార్షిక పరీక్షలు సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో జరగేవి. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి జనవరి లోనే వార్షిక పరీక్షలు నిర్వహించడానికి సమాలోచనలు చేస్తున్నారు.
విద్యార్థులు పౌటీ పరీక్షలైన జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, సీయూఈటీ యూజీ వంటి ప్రవేశ పరీక్షలకు సన్నద్దం కావడానికి తగినంత సమయం దొరకుకుతుందని కొందరు విద్యావేత్తలు తెలిపారు.
ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల విద్యార్థులపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉన్నదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.