INTERMEDIATE – అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్స్

BIKKI NEWS (JULY 25) : INTERMEDIATE PRACTICALS FOR ALL SUBJECTS. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణ రాబోతుంది ఇప్పటివరకు కేవలం సైన్స్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్కు మాత్రమే ఉన్న ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సబ్జెక్టులకు వర్తింపజేయాలని బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

INTERMEDIATE PRACTICALS FOR ALL SUBJECTS.

పబ్లిక్ పరీక్షలను 80 మార్కులతో నిర్వహించాలని, మిగతా 20 మార్కులను ప్రాక్టికల్ రూపంలో ఇంటర్నల్ గా కేటాయించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

దీనిపైన త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ విద్యా సంవత్సరం నుండే ఇంటర్మీడియట్ లోని అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

రెండు సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.