BIKKI NEWS (DEC. 18) : INTERMEDIATE MARKS MEMO FULLY SECURED. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్లను మరింత భద్రంగా, నమ్మదగినవిగా మార్చనుంది. ఈ కొత్త విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేనుంది.
INTERMEDIATE MARKS MEMO FULLY SECURED.
అందులో భాగంగా ఉండే ముఖ్య అంశాలు
- UV ఫైబర్స్
- హోలోగ్రామ్ & వాటర్‌మార్క్
- రంగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- నీరు & చించుకుపోని కాగితం
- QR కోడ్ ద్వారా ఆన్‌లైన్ వెరిఫికేషన్
- గత 6 ఏళ్ల విద్యార్థుల డిజిటల్ డేటా
UV ఫైబర్స్: సర్టిఫికెట్‌పై ఉన్న ఈ ఫైబర్స్ సాధారణంగా కంటికి కనిపించవు.UV లైట్ వేస్తే మాత్రమే కనిపిస్తాయి. నకిలీ సర్టిఫికెట్ అయితే వెంటనే బయటపడుతుంది.
హోలోగ్రామ్ & వాటర్‌మార్క్: సర్టిఫికెట్‌ను కాంతిలో చూసినప్పుడు ప్రత్యేక గుర్తులు కనిపిస్తాయి. ఇది అసలైన సర్టిఫికెట్టేనా కాదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
రంగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో : ఇప్పటివరకు నలుపు–తెలుపు ఫోటో ఉండేది. ఇకపై విద్యార్థి రంగు ఫోటో ముద్రిస్తారు. సర్టిఫికెట్ ఎవరిదో సులభంగా గుర్తించవచ్చు.
నీరు & చించుకుపోని కాగితం : కొత్త సర్టిఫికెట్ నీటిలో పడినా పాడవదు, సులభంగా చించుకుపోదు, కాగితం మరింత బలంగా ఉంటుంది. సర్టిఫికెట్ ఎక్కువకాలం భద్రంగా ఉంటుంది.
QR కోడ్ ద్వారా వెరిఫికేషన్ : ప్రతి సర్టిఫికెట్‌పై ఒక QR కోడ్ ఉంటుంది. మొబైల్‌తో స్కాన్ చేస్తే ..
- విద్యార్థి పేరు
- మార్కులు
- సంవత్సరం
- బోర్డు రికార్డు
అన్నీ వెంటనే కనిపిస్తాయి. బోర్డు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
డిజిటల్ డేటా భద్రత: గత 6 సంవత్సరాల విద్యార్థుల వివరాలు బోర్డు వెబ్‌సైట్‌లో డిజిటల్‌గా ఉంటాయి. ఫేక్ సర్టిఫికెట్లకు అవకాశం ఉండదు.

