BIKKI NEWS (OCT. 24) : INTERMEDIATE EDUCATION KEY CHANGES FROM 2026 – 27. ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు. 2026 – 27 విద్యా సంవత్సరం నుండి ఈ సంస్కరణలు అమలు కామన్నాయి.
INTERMEDIATE EDUCATION KEY CHANGES FROM 2026 – 27.
అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులకు రాత పరీక్షలు, 20% అంతర్గత మార్కులను కేటాయించనున్నారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు కూడా అంతర్గత మార్కులను కేటాయించనున్నారు.
ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో సెకండియర్ లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఫస్టియర్ లో కూడా వాటిని నిర్వహించనున్నారు.
కొత్తగా ఏసీఈ అనే గ్రూపును ప్రవేశపెడతారు. అంటే ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో కొత్త గ్రూపును అందుబాటులోకి తెస్తారు.
ప్రస్తుతం సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్నాయి. ఎకౌంటెన్సీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త గ్రూపును సృష్టిస్తున్నారు.
కొత్త సిలబస్ ను రూపొందిస్తారు. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సిలబస్ తగ్గనుంది.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) నిర్దేశించిన దాని కంటే ఇక్కడ సిలబస్ ఎక్కువగా ఉంది. ఎన్సీఈఆర్ టీతో సమానంగా సిలబస్ నుఉంచనున్నారు.
పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. దాన్ని స్కాన్ చేయడం వల్ల మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీలవుతుంది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

