Women World Cup – నేటి నుండి మహిళల ప్రపంచ కప్

BIKKI NEWS (SEP. 30) : ICC WOMEN WORLD CUP 2025. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 నేటి నుండి ప్రారంభం కానుంది. శ్రీలంక భారత్ దేశాలు ఈ టోర్నీకి ఆతిధ్యం ఇస్తున్నాయి.

ICC WOMEN WORLD CUP 2025

ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. నవంబర్ 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

తొలి మ్యాచ్ లో భారత్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 5 న భారత్ పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. 9న దక్షిణాఫ్రికాతో, 11 న ఆస్ట్రేలియాతో, 19న ఇంగ్లాండ్ తో, 23న న్యూజిలాండ్ తో, 26న బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ లను ఆడనుంది.

మహిళల క్రికెట్ లో మన జట్టు 1976లో ప్రవేశించింది. ఇంతవరకు ఒక్క ప్రపంచ కప్ ను కూడా భారత మహిళా జట్టు గెలుచుకోలేదు.

1997లో సెమీఫైనల్ లో ఓడిపోయింది . 2005, 2017 లలో ఫైనల్ కు చేరుకున్న రన్నరప్ గానే మిగిలిపోయింది.

ఇప్పటివరకు 12 సార్లు మహిళల ప్రపంచకప్ నిర్వహిస్తే ఆస్ట్రేలియా అత్యధికంగా ఏడుసార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒక్క సారి విజేతగా నిలిచాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK