BIKKI NEWS (SEP. 03) : Guest Faculty Jobs in Nizam college hyderabad. హైదరాబాద్ లోని నిజాం కాలేజ్‌లో భారీగా గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Guest Faculty Jobs in Nizam college hyderabad.
పోస్టుల వివరాలు :
- ఇంగ్లీష్,
- తెలుగు
- కంప్యూటర్ సైన్స్,
- ఎకనామిక్స్,
- కామర్స్,
- బయోటెక్నాలజీ,
- బిజినెస్ మేనేజ్‌మెంట్,
- ఫిజిక్స్,
- కెమిస్ట్రీ,
- మ్యాథమేటిక్స్,
- ఎలక్ట్రానిక్స్,
- జనెటిక్స్ తదితర విభాగాలు
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో M.A., M.Com., M.Sc., M.C.A లాంటీ పీజీల్లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. UG & PG స్థాయిలో బోధన అనుభవం ఉండటం, నెట్ / సెట్ / పీహెచ్డీ / ఎంఫిల్ వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు విధానం & గడువు :
ఇచ్చిన ఫార్మాట్‌లో పూర్తి బయోడేటాతో అప్లికేషన్‌లను ప్రిన్సిపల్, నిజాం కాలేజ్, బషీర్ బాగ్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2025
ఎంపికైన వారికి ఇంటర్వ్యూలో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.