- BIKKI NEWS : 16-01-2026
Group 3 appointment papers were handed over by the CM. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి 1370 మంది గ్రూప్ 3 ఉద్యోగులను ఆహ్వానిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఈరోజు అందజేశారు.
Group 3 appointment papers were handed over by the CM
ఈరోజు హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో జరిగిన గ్రూప్ 3 అభ్యర్థుల నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో పి నూతన గ్రూప్ 3 ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు.
దాదాపు 25వ శాఖలలోకి ఈ 1370 మంది ఉద్యోగులను పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే 70,000 మందికి నియామక పత్రాలు అందజేసిందని తెలిపారు .గ్రూప్ 1, 2, 3 వంటి నియామకాల కోసం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని నియామకాలు చేపట్టామని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
విద్య వలనే జీవితం మారుతుందని కావున దానిని పేదలకు పంచడానికి మీరు తోడ్పడాలని కొత్తగా నియామకమైన ఉద్యోగులకు సూచించారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దేశంలో 10 శాతానికి చేర్చాలని రేవంత్ రెడ్డి సూచించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యసాధన కోసం కృషి చేయాలని సూచించారు.
తల్లిదండ్రులను గౌరవంగా, మంచిగా చూసుకోని ఉద్యోగులకు వేతనంలో 10% కోత విధించి వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు.


Comments are closed.